చంద్ర‌గ్ర‌హ‌ణం రోజు క్షుద్ర‌పూజ‌లు గ్ర‌హ‌ణం స‌మ‌యంలో ఈ మ‌నుషులు ఏం చేశారో తెలిస్తే షాక్

468

అతింద్రేయ శ‌క్తులు మూడ న‌మ్మ‌కాలు చేత‌బ‌డి బాణామ‌తి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక క్షుద్ర‌విద్య‌లు మ‌న‌దేశంలో ఇంకా అనేక చోట్ల వినిపిస్తూనే ఉంటాయి.. చేత‌బ‌డి బాణామ‌తి అనేవి ఇంకా ప‌ల్లెల్లో అక్క‌డ‌క్క‌డా వింటూ ఉంటాము.. ఇక గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఇలాంటి అనేక వార్త‌లు వింటూ ఉంటాం… నిజంగా స్మ‌శానాలు అలాగే ద‌ట్ట‌మైన అడ‌వుల్లో జ‌న సంచారం లేని చోట్ల ఇలా అనైతిక కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటారు.. వీరు పోలీసుల చేతికి చిక్కితే అనేక కేసులు వీరిపై బ‌నాయించ‌వ‌చ్చు. కాని కొంద‌రి సాయంతో ఇటువంటి మూడ‌న‌మ్మ‌కాల‌ను విశ్వాసాల‌ను మ‌రింత ప్ర‌చారంలోకి తీసుకువ‌స్తున్నారు.

Image result for lunar eclipse

ఇక చంద్ర‌గ్ర‌హ‌ణం రోజు న‌ర‌బ‌లి ఇచ్చినా, జంతుబ‌లి ఇచ్చినా మ‌నం ఎవ‌రిని అయితే న‌ర‌శాస్తి చేయాలి అని అనుకుంటున్నామో వారిపై క్షుద్ర‌పూజ‌ల చేస్తే మ‌రింత ఫ‌లితం ఉంటుంది అని, వారి ఎదుగుద‌ల వారి జీవితం భ‌స్మం అవుతుంది అని కొంద‌రు ఇటువంటి ప‌నులు చేస్తారు. అందుకే చంద్ర‌గ్ర‌హ‌ణం, సూర్య‌గ్ర‌హ‌ణ స‌మ‌యాల్లో ఇటువంటి కార్య‌క‌లాపాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా జ‌రిగింది.కృష్ణా జిల్లా నూజివీడు మండలం యలమందలో నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారు కొంద‌రు మంత్ర‌గాళ్లు..ఇప్పుడు ఇదే విష‌యం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

Image result for kshudra pooja

 

వందేళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన సుదీర్ఘ చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయనే నమ్మకంతో ఏడుగురు వ్యక్తులు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారు. అందుకు వారు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు… నరబలి ఇచ్చిన తర్వాత మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యిని కూడా తవ్వించారు. చిన్నం ప్రవీణ్‌ అనే వ్యక్తిని బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు…దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ క్షుద్రపూజలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. హైదరాబాదులోని ఉప్పల్ లో ఓ చిన్నారిని బలి ఇచ్చిన ఘటనను మరిచిపోక ముందే అటువంటి ఘటన వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపుతోంది తెలుగు రాష్ట్రాల్లో.

నిజంగా నిమ్మ‌కాయ‌లు తొక్క‌డం మిర‌ప‌కాయ‌ల‌తో ధిష్టితీయ‌డం లాంటి ప‌నులు మూడ‌న‌మ్మ‌కాలుగా గ్ర‌హ‌ణం త‌ర్వాత చేస్తారు.. ఇలా క్షుద్ర‌పూజ‌లు చేసి అతింద్రీయ శ‌క్తులు ఆవాహానం చేసుకోవాలి అనే కోరిక‌తో, లేనిపోనివి ద‌క్కాలి అని ఆశ‌తో చేసే ప‌నులు ఇవి అని హేతువాదులు చెబుతున్నారు.. గ్ర‌హ‌ణం సైన్స్ ప్ర‌కారం జ‌రిగేది అని ఇలా మూడ‌న‌మ్మ‌కాల జాడ్యం దానికి అంటించ‌కండి అని చెబుతున్నారు. చూశారుగా న‌మ్మకాలు ఎలా ఉన్నాయో,చివ‌ర‌కు ఆ న‌మ్మ‌కాలు విశ్వాసాల కోసం ఎంత దారుణ‌మైన ప‌నుల‌కు అయినా పాల్ప‌డ‌తారు అన‌డానికి సాక్ష్యం ఇదే.