బతుకమ్మ పండుగ వెనుక ఉన్నఅసలు కథ…. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి

335

దసరా వచ్చేస్తుంది.దేశం మొత్తం ఈ పండుగ హడావిడి మొదలయ్యింది.అయితే అన్ని రాష్టాలలో కంటే ఈ పండుగను తెలంగాణ రాష్టంలో ఎక్కువగా జరుపుకుంటారు.ఎందుకంటే దసరాకు తోడు బతుకమ్మ పండుగ కూడా జరుగుతుంది కాబట్టి.అయితే మనలో చాలా మందికి బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో తెలియదు.బతుకమ్మ ఆడటం వచ్చు కానీ మహిళలకు బతుకమ్మ ఎందుకు వచ్చిందో తెలియదు.మరి ఆ బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా.

Image result for bathukamma

ఒక ఊర్లో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క చెల్లెలు ఉండేది. ఆమె అంటే ఆ అన్నలకు పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. ఆ బాధను తట్టుకోలేక ఆ చెల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది.తర్వాత కొన్నిరోజులకు ఆ అన్నలు తిరిగొచ్చారు. తమ చెల్లెలు కనబడకపోయేసరికి చెల్లి ఎక్కడ అని భార్యల్ని నిలదీశారు. చెల్లెలు ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకొని వెతకడానికి బయలుదేరుతారు. అప్పటి నుంచి తిండీ తిప్పలు, నిద్రాహారాలు లేకుండా.. చెల్లెలి కోసం వెతుకుతుంటారు. దాహం వేసి ఓ ఊరి పొలిమేరలోని బావిలో నీరు తాగుతుండగా పెద్ద తామరపువ్వు నీటిపై తేలుతూ వారి దగ్గర కొచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి.

Image result for bathukamma

కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెరువు చూపింది కాబట్టి ‘బతుకమ్మ’ అయ్యింది! ఇదో జానపద గాథ.బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది.మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో కథ ప్రచారంలో ఉంది. ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే ‘బతుకమ్మ’ అనేవారూ ఉన్నారు.అలాగే ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం ‘‘బతుకమ్మా’’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందింది.

‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు.దానినే బతుకమ్మ అంటారు. అలాగే దక్షిణ భారత దేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు తల్లితండ్రులు ఆమెకి ‘‘బతుకమ్మ’’ అని పేరు పెట్టారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను ఆనవాయితీ అయిందట.నేపథ్యం ఏదైనా ‘బతుకమ్మ’ సంప్రదాయం తెలంగాణ ప్రజల జీవితాల్లో ఓ భాగమైంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తెలంగాణాలో జరిపే ఈ బతుకమ్మ పండుగ గురించి ఆ పండుగ జరుపుకోడానికి వెనుక ఉన్న కథల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.