ఈ మ‌సీదులో ఖురాన్ భ‌గ‌వ‌ద్గీత చ‌దువుతారు ఎక్క‌డో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు ఇలా ఎందుకు చేస్తారంటే

534

ప్ర‌పంచంలో ఒక్కొక్క‌రికి ఒక్కో మ‌తం ఉంటుంది.. వారి అభిమ‌తం ప్ర‌కారం వారు అది పాటిస్తారు.. వారి వారి పూజా విధానాలు ప్రార్ధ‌నా కార్య‌క్ర‌మాలు చేసుకుంటారు. అలాగే వారి ఇష్ట‌దైవాన్ని కొలుచుకుంటారు.. అందుకే మ‌న దేశంలో సైతం ఎవ‌రి మ‌తాన్నివారు పాటిస్తూ ప‌ర‌మ‌తాన్ని గౌర‌విస్తారు. ఇక హిందూ, ముస్లిం, క్రైస్త‌వులు ఎవ‌రి గ్రంధాలు వారు ప్రార్ధ‌నాల‌యాల‌లో చ‌దువుకుంటారు.. బైబిల్ ని క్రైస్త‌వులు వారి మ‌త గ్రంధంగా, ముస్లింలు ఖురాన్ ని వారి మ‌త గ్రంధంగా, ఇక భ‌గ‌వ‌ద్గీత‌ను హిందువులు వారి మ‌త గ్రంధాలుగా పాటిస్తారు.

Image result for bhagavad gita

 

అయితే ఏ గుడిలో అయినా చ‌ర్చిలో అయినా మ‌సీదులో అయినా వారి మ‌త‌గ్రంధాల‌ని వారు గౌర‌విస్తూ వాటిని పాటిస్తారు.. అయితే ఇప్ప‌డు ఈ విష‌యం తెలుసుకుంటే ఆశ్చర్య‌పోతారు.. ఓ మ‌సీదులో క్రైస్త‌వ గ్రంధాలు అలాగే హిందూ పురాణాలు చ‌ద‌వ‌వ‌చ్చు..ఔను విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నా ఇది స‌త్యం… న‌మ్మ‌ద‌గిన వాస్త‌వం కూడా..ఆ మసీదులో హిందూ, క్రైస్తవ గ్రంథాలు చదవొచ్చు. ఇది ఎక్క‌డ ఉంది అంటే? అస్సాంలోని కచర్ జిల్లాలోని సిల్చర్‌లో ఉంది.. ఇక్క‌డ జమా మసీదులోని రెండో అంతస్తుకు వెళ్తే.. అక్కడ పదికి పైగా పుస్తకాల అల్మారాలు కనిపిస్తాయి. వాటిలో 300 పైగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి.

Image result for kuran

అయితే ఇక్క‌డ పెద్ద‌లు చెప్పే విష‌యం వింటే మ‌త సామ‌ర‌స్య‌త గురించి, వారు ఎంత చ‌క్క‌గా వివ‌రించారో తెలుసుకోవ‌చ్చు.. ప్ర‌జ‌ల‌కు ఇత‌ర మ‌తాలు త‌త్వాల గురించి తెలియ‌చేయ‌డానికి ఇక్క‌డ ఇలా పుస్త‌కాలు ఉంచామ‌ని, అంద‌రూ స‌మాన‌మే అన్ని మ‌తాలు స‌మాన‌మే అనే విష‌యం వారికి తెలియ‌చేయాల‌ని, ఇక్క‌డ ఇలా ఏర్పాటు చేశామ‌ని తెలియ‌చేశారు.

2012 లో ఈ గ్రంథాల‌యం ఏర్పాటు చేశారు… ఇప్పుడు ఈ గ్రంథాల‌యం అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటోంది.. ఇది స‌బీర్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు.. ఆయ‌న చేసిన ఈ ప‌నికి అక్క‌డ అన్ని మ‌తాల వారు ఆయ‌న‌ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.. మ‌తాల విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న వారికి స‌బీర్ ని చూపించి ఆయ‌న మంచిత‌నం అల‌వ‌ర‌చుకునేలా చేయాలి అని చెబుతున్నారు.. అంద‌రం సోద‌రులుగా క‌లిసి ఉండాల‌ని స‌బీర్ చేసిన ప్ర‌య‌త్నం పై ప్ర‌శంసల హర్షం వ్యక్తం అవుతోంది. చూశారుగా ఏ మ‌తం అయినా ఒక‌టే అంద‌రూ స‌మాన‌మే అనేలా ప్ర‌జ‌లు అంద‌రూ ఉండాలి.. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.