ఆగస్ట్ 11 సూర్యగ్రహణం రోజు బయటకు వస్తే చాలా ప్రమాదం.. ఎందుకో తెలుసా?

462

భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడతుంది. ఆ సమయంలో చంద్రుడి నీడ సూర్యుడిపై పడటం వల్ల చీకటి అలుముకుంటుంది. చంద్రుడి నీడ సూర్యుడిని పూర్తిగా ఆవహించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో ప్రకాశవంతుడైన సూర్యుడు ఒక సన్నటి అంచులా కనిపిస్తాడు. అలాంటప్పుడు ఉష్ణోగ్రత కూడా గణనీయంగా పడిపోతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది.సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉండక సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటే ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. ఆగస్టు 11 న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. శనివారం మధ్యాహ్నం 1.32 గంటలకు మొదలై సాయంత్రం 5.02 గంటల వరకు దాదాపు మూడున్నర గంటలు ఈ గ్రహణం ఆకాశంలో కనువిందు చేయనుంది.

Image result for సూర్యగ్రహణం

అయితే ఇది ఉత్తరార్థగోళంలోని ముఖ్య ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది. భారత్‌లో దీని ప్రభావం ఉండదు.. అయితే ఈ గ్రహణ సమయంలో బయటకు వస్తే కొంచెం ప్రమాదమంట.మరి అందులో నిజమెంతో అబద్దం ఎంతో తెలుసుకుందామా.సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే సంభవిస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు అలాగే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుంచి మాయమై చీకటి కమ్ముకోవడంతో భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇలాంటి నమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

Image result for సూర్యగ్రహణం

ప్రస్తుతం సంభవించే సూర్యగ్రహణ గమనాన్ని గుర్తించడానికి గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో నాసా ఓ మ్యాపును సృష్టించింది. దీని ప్రకారం.. సూర్యగ్రహణం సైబీరియా తూర్పు భాగంతోపాటు ఉత్తర ధ్రువంలోని చూసే అవకాశం ఉంది. అయితే సూర్య గ్రహణాలను నేరుగా చూడరాదు. ప్రత్యేక కళ్లజోడు సాయంతో దీనిని చూడవచ్చు. నేరుగా చూడటం వల్ల గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల తీక్షణతకు కంటిచూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.కాబట్టి గ్రహణ సమయంలో ఆకాశం వైపుకు చూడకూడదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈ విషయం గురించి సైంటిస్టులు మాట్లాడుతూ సూర్య గ్రహణాన్ని చూడటానికి ఎలాంటి కళ్ళద్దాలు అవసరం లేదని చెప్తున్నారు.అయితే ఏ మనిషి కూడా సూర్యుడ్ని నేరుగా చూడలేడు కాబట్టి సూర్యుడ్ని చూడటానికి కళ్ళద్దాలు పెట్టుకోవాలి.మామూలు సమయంలో కూడా సూర్యుడ్ని చూస్తే మన కళ్ళకు ప్రమాదమే.అంతేకానీ సూర్య గ్రహణాన్ని చూస్తే ఏదో అవుతుంది.గ్రహణాన్ని చూడడం వలనే మన కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పడంలో అర్థం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.కాబట్టి గ్రహణం చూడాలి అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది.మరి ఈ విషయం మీద మీరేమంటారు.గ్రహణాన్ని చూస్తే ప్రమాదమా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.