2018 వృషభ రాశి ఫలితాలు

1815

జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్ప బడుతుంది…ఇలా వారి జన్మ రాశి అలాగే నక్షత్రం బట్టి జాతకాలు చెబుతుంటారు. ఐతే వచ్చే కొత్త సంవత్సరం లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిజేస్తారు . 12 రాశుల్లో ఈ రోజు వృషభ రాశి గురించి తెలుసుకుందాం.

ఆదాయం: 11, వ్యయం: 5; రాజపూజ్యం: 1, అవమానం: 3 వృషభ రాశి వారు ఈ ఏడాది వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.
వృషభ రాశివారు 2018లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరికి కొన్ని అడ్డంకులు ఎదరవుతాయి. మీ రంగంలో మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2018 లో మీరు మీ వ్యాపారంలో మరింత రాణించేందుకు, లేదా మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు అనువుగా ఉండదు. మీరు చేయదలచుకున్న చాలా పనులకు అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ఓపిక సహనం మీకు చాలా అవసరం. ఎందుకంటే శని మీపై ఎక్కువా ప్రభావం చూపే అవకాశం ఉంది.

స్వరూపం
ఈ రాశి వారిలో చాల మంది నలుపుగా ఉండటంవల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్దం గా ఉంటుంది. ప్రతిఒక్కరినీ కలుపుపోయే అలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది.

వ్యాపారం
భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. వీరు ఈ వ్యాపారంలో ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితోపాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో ముందుకు వెళ్తారు… ఐతే వీరికి ఇబ్బందులు ఎదురౌతుంటాయి.. వాటన్నిటిని కూడా అధిగమిస్తారు.

ఆర్థిక స్థితి
సాద్యమైనంత వరకు వీరు చాల శ్రమ పడి చెయ్యవలసి వుంటుంది .. ఎంత శ్రమించిన కూడా వీరి చేతిలో డబ్బు మాత్రం నిలువదు. మంచినీళ్లలా ఖర్చవుతుంది. అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు గానీ తల్లిదండ్రులకు గానీ అప్పగించటం మేలు.. ఐతే వీరు ఆలోచనలకు సాన పెడతారు . వీరి సంకల్ప బలంమే వీరిని విజయ పథం లో నడిపిస్తుంది.

స్వభావం
వృషభ రాశికి చెందినవారు ధృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం వీరికి వుంటుంది . అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగినవారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి ఎక్కువగా ఉంటాయి.

వృత్తి, జీవిత గమనం
ఈ రాశి వారికీ నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతోపాటు తమకు తెలిసిన విషయాలను పదిమందికి చెప్పాలని చూస్తారు. ఉపాధ్య వృతి లో అయితే బాగా రాణించగలరు .. ఇక విద్యార్థులు అయితే మంచి ఫలితాలను సాదిస్తారు .. అన్ని టిలో విరి చురుకుగా పాల్గొంటారు.

ప్రేమ సంబంధాలు

ఈ రాశి వారికీ ప్రేమ ఎక్కువగా ఉంటుంది అది ఎంతలా అంటే వీరిని విరికంటే కూడా వారికీ నచ్చిన వారిని ఎక్కువగా ప్రేమిస్తారు. వీరు ఎప్పుడూ పిల్లా-పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు.

స్నేహం
మిధున, కన్యా, మకర, కుంభ రాశులకు సంబంధించిన వారు వృషభరాశివారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలు మెండుగా వుంటాయి. అందువల్ల ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించటం ఎంతైనా అవసరం. ఇక వృశ్ఛిక రాశివారితో నైతో పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది.. కాబట్టి ఈ రాశి వారికీ దూరంగా ఉంటడం చాల మంచిది.

అలవాట్లు
వృషభరాశి వారు పుస్తకాలు చదవడం , ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనటం ఓ హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి అహర్నిశలు కృషిచేస్తారు.వారిని వారు ఎక్కువగా సంతోషంగా ఉంచుకోవడం కోసం ఎలాంటి సాహసమైన చేస్తారు.

దాంపత్య జీవితం
వృషభరాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు.. 2018 కుటుంబం లో చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని ఈ రాశి చక్కబెతారు.

బలహీనతలు
ఈ రాశివారు ఎప్పుడుకూడా సొంత నిర్ణయాలు తీసుకోరు. చాల బద్దకస్తులు ఐతే వీరికి మొండి పట్టుదల ఉంటుంది దాంతో ఎవరికీ లొంగనివారుగానూ ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించటానికి వెనుకాడని వారుగా ఉంటారు.

అదృష్ట రత్నం
కెంపు, ముత్యం, పగడపు రాళ్లలో ఏదో ఒకదానిని ధరించాలి. దానివల్ల తలపెట్టిన పనులు త్వరగా పూర్తవడంతో పాటుగా అదృష్టం తలుపు తడుతుంది.

విద్య
అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్యవిద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు.

ఆరోగ్యం:
ఆరోగ్యరీత్యా వృషభరాశివారు ఈ ఏడు కాస్త ఇబ్బంది ఎదుర్కుంటారు . అంతే కాదు దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీరి గ్రహ స్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తిగతీకరించటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి ముందుజాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

ఇల్లు-కుటుంబం:
వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. విరు కూడా తమ కంటే చిన్న వారిదగ్గర గౌరవ మర్యాదలు పొందుతారు. వీరి సంతానం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతికోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషబరాశికి చెందినవారు ఉంటారు.. సంతన యోగం లేని వారికీ ఈ ఏడు ఈ యోగం ఉంది.

కలిసివచ్చే రోజు
వృషభరాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వీరీకి కలిసివచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీనితోపాటు బుధవారం, శనివారం కూడా వీరికి కలిసివచ్చే రోజులే అవుతాయి.. ఈ రోజుల్లో ఏపని చేపట్టిన కూడా విరు విజయం సాదిస్తారు.

అదృష్ట సంఖ్య
ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. దీనితోపాటు 14, 23, 32, 41, 50, 59, 68… సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే. అయితే వీరికి 3, 8, 9 అంకెలు అశుభ అంకెలు.

అదృష్ట రంగు
వృషభరాశికి చెందినవారికి అదృష్ట రంగు నీలం రంగు. ఈ రంగుతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది. వీరికి ఈ మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది .

పరిష్కారం :
రాహువు , శని అలాగే గురు గ్రహాలకు విలుకుదిరినప్పుడు శాంతి జరిపిస్తూ ఉండాలి..దీని వలన వీరికి ప్రతికూల పరిస్థిని ఎదుర్కొనే సామర్ధ్యం వస్తుంది.