2018 సింహ రాశి ఫలితాలు

1779

సాదారణం గా సింహ రాశి వారు .. అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు..ఇలాంటి సింహ రాశి వారికీ ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..

మఖ 1,2,3,4 పాద , పుబ్బ 1,2,3,4, పాదములు , ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో సింహ రాశి వారి ఆదాయం: 11, వ్యయం: 11; రాజపూజ్యం: 3, అవమానం: 6

వ్యాపారం

సింహ రాశి వారికి ఈ ఏడాదిలో ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.పేరుప్రఖ్యాతులు గడిస్తారు. ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి

ఆర్థిక స్థితి
వీరు మొదటినుంచి కష్టపడే తత్వంగలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో ఒకటిరెండుసార్లు ఆలోచించి అడుగువేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. అన్ని రంగాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి.

వృత్తి, జీవిత గమనం
మార్చి – జూలై మాసాల మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. గురువు అక్టోబర్‌ 12 వరకు తులలో ఆ తరువాత వృశ్చికంలో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సోదరీసోదరులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలకు అనుకూలం.

ప్రేమ సంబంధాలు
ఈ ఏడాది 5వ స్థానంలో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి.

స్నేహం
వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్ధిక సహాయాన్ని సైతం చేస్తారు.

అలవాట్లు
విభిన్నతకు, ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు, టీవీ, నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. సదా విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాన్నీ నేరుచుకుంటూ ఉంటారు.

దాంపత్య జీవితం
వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తుంది. అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగిఉంటారు. ఐతే అర్థిక సమస్య ల వల్ల వీరి మద్య చిన్న పాటి గొడవలు ఉంటాయి.

Happy Couple Sitting On Couch

బలహీనతలు
వీరు ఇతరుల చెప్పే విషయాలను అమలు చేయటంవల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారినుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకుని వారినుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి.అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి.

అదృష్ట రత్నం
వీరికి అదృష్ట రత్నం పగడం. దానిని ధరించటంవల్ల వీరికి వచ్చే కష్టాలు ఇట్టే తొలగిపోతాయి. అలాగే ఈ రాయిని ఉంగరంలో ధరిస్తే మంచిది.

ఆరోగ్యం
శని వక్రగమనంలో వున్న ఏప్రిల్‌ 19 – సెప్టెంబర్‌ 7 తేదీల మధ్య వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం. ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. 12 – 6 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు.

ఇల్లు-కుటుంబం
వీరు ఎప్పుడూ పిల్లా-పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కలిసివచ్చే రోజు
వీరికి ఆది, సోమ, మంగళ, శుక్ర, శని వారాలు బాగా కలిసివస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం ఉండదు. బుధ, గురు వారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది.

అదృష్ట సంఖ్య
కన్యారాశివారి అదృష్ట సంఖ్య 5. దీనితోపాటు 14, 23, 32, 41… సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే.అయితే 3, 8, 9 అంకెలు అశుభ అంకెలు.

అదృష్ట రంగు
వీరికి పచ్చరంగు బాగా కలిసివస్తుంది. అలాగని వీరు ఎప్పుడూ ఈ రంగు వస్త్రాలను ధరించాలని అనుకుంటూ ఉంటారు. పచ్చరంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది.

పరిష్కారం :

ఈ ఏడాది అంతా కూడా బాగుంది ఐతే వీరు సుర్యభావనుడి అరాదన చేస్తుండాలి.. ఆది వారం నాడు రవి గ్రహానికి పూజ చెయ్యడం వల్లన ఆర్థిక భాదలు తొలగిపోతాయి.