వృశ్చిక రాశి ఫలితాలు 2018

1769

హిందూ ధర్మ శాస్త్రలో జ్యోతిస్యానికి మంచి ప్రాముఖ్యత కలిపించ బడింది ..మనలో ప్రతి ఒక్కరికి కూడా భవిష్యతు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఉంటుంది.ఐతే పుట్టిన సమయం బట్టి నక్షత్రం , రాశి ని బట్టి మన భవిష్యతు ఎలా ఉంటుందో పండితులు చెబుతారు. మనకు ఉన్నవి 12 రాశులు ఒక్కకొక్క రాశి కి ఒక్కకొక్క ప్రత్యేకత ఉంటుంది. మనిషి ఆలోచన పైన గ్రహ ప్రభావం ఉంటుంది. కాల గమనానికి రాశులు ముఖ్యమైనవి కాబట్టి మనిషి ఆలోచన పైన వీటి ప్రభావం చాల వుంటుంది. ఐతే 12 రాశుల్లో ఒకటైన వృశ్చిక రాశి వారికీ 20 18 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం .

ఈ క్రింది వీడియో చూడండి.

వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు… వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది.

వ్యాపారం
సాఫ్ట్‌వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. ఈ ఏడాది ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు.

Related image

ఆర్థిక స్థితి
వ్యాపారంలో రాణించటంవల్ల ఆర్ధిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. వీటి కొనుగోళ్లవల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది.క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం చేకూరుతుంది. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాల వారికి శుభప్రదం.మార్చి 10 నుంచి జూలై 10 వరకు ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం పెరిగినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు.

వృత్తి, జీవిత గమనం
ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ది సాధించటానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తుంది. గురువు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్న ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు.

ప్రేమ సంబంధాలు
వృశ్చిక రాశికి చెందిన వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అక్టోబర్‌ నుంచి గురువు మీ చంద్ర రాశిలో సంచారం చేస్తాడు. ఫలితంగా విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు.ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Related image

అలవాట్లు
ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు.విరు ఎప్పుడు కొత్త విషయాన్నీ తెలుసుకోవాలని అనుకుంటారు..

దాంపత్య జీవితం
ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడంవల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తటానికి కృషి చేస్తుంటారు. వీరు ఎప్పుడు కూడా ఒకరి మాట ఒకరి మీద నమ్మకం కలిగి ఉంటారు.

బలహీనతలు

వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనతా లక్షణాలు అసూయా ద్వేషాలు. అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.. వీరికి వీరి కుటుంబ సభ్యులే శత్రువులు అవుతారు.

అదృష్ట రత్నం
ఈ రాశి వారు పుష్యరాగం, నీలం, పచ్చరాయిలలో దేనిలో ఒకదానినైనా తప్పనిసరిగా ధరించాలి. దానివల్ల వారు అనుకున్న పనులు నెరవేరుతాయి.

ఆరోగ్యం
గ్రహ రాశుల అననుకూలతవల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురవుతారు. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం దరికి చేరదు. వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి. లేదంటే అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతాయి.9 – 3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి.

Related image

ఇల్లు-కుటుంబం

సోదరీసోదరులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది.పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణంగా మాటపడాల్సి వస్తుంది.కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి.

కలిసివచ్చే రోజు
బుధ, గురు, శుక్ర, శనివారాలు వీరికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు.

అదృష్ట సంఖ్య
వృశ్శికరాశివారి అదృష్ట సంఖ్య 9. ఈ అంకెతోపాటు 18, 36, 45, 63… కూడా అదృష్ట సంఖ్యలే.

అదృష్ట రంగు
ఈ రాశి వారి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ. ఈ రంగు దుస్తులను ధరించటం వల్ల మానసిక శాంతిని పొందుతారు.

Related image

 

 

పరిష్కారం :
ప్రతి రోజు శ్రీ దక్షిణామూర్తి ఆరాధన వీరికి శుభఫలితాలను ఇస్తుంది..