మీనా రాశి ఫలితాలు 2018

1329

ప్రతి ఒక్కరికి వారి భవిష్యత్తు తెలుసుకోవాలి ఉంటుంది .. ఇందుకోసం పండితుల వద్దకు వెళ్లి తమ జాతకం గురించి వివరాలు తెలుసకుంటారు .. తన పుట్టిన తేదిని బట్టి లేదా జన్మ నక్షత్రమును బట్టి వారి రాశి అదే విధంగా వారి జతకంను చెబుతారు .. ఐతే ఇక్కడ మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి

ఈ క్రింది వీడియో చూడండి.

వీరు నలుపుగా ఉండటంవల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్దం. ప్రతిఒక్కరినీ కలుపుపోయే అలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. మరి వీరికి 2018 లో ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ..

పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు.
శ్రీ విళంబి నామ సంవత్సరం లో వీరికి ఆదాయం: 5, వ్యయం: 5; రాజపూజ్యం: 3, అవమానం: 1

వ్యాపారం
వీరు మొదటినుంచి కష్టపడే తత్వంగలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో ఒకటిరెండుసార్లు ఆలోచించి అడుగువేస్తారు. దీనివల్ల వీరికి ఆర్ధికంగా లాభాలు కురిపిస్తాయి.ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పైచదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు తగిన సమయం. రాజకీయ, కళ, సినీ, రక్షణ, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Related image

ఆర్థిక స్థితి
ఈ ఏడు మీనరాశి కి అనుకున్నంత పొందడానికి బాగా కష్ట పడతారు . స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు.ఉద్యోగ వ్యాపారాల్లో మార్పుల కోసం ప్రయత్నిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృత్తి, జీవిత గమనం
మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. నృత్యం, సంగీతం , సాహిత్యం వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు.అక్టోబర్‌ నుంచి న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.వైద్యరంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది. మార్చి 10 నుంచి జూలై 10 మధ్య విద్యార్థుల చదువులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. న్యాయ సంబంధిత వ్యవహారాలు పరిష్కారమవుతాయి.

Related image

ప్రేమ సంబంధాలు
దయ, జాలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వంగల మీనరాశికి చెందిన మీన రాశికి చెందినవారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక. అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీనుంచి కొంత సహాయం అవసరమవుతుంది.

అలవాట్లు
మీన రాశికి చెందిన వారు కథలు, రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు. సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్లగలరు. ఏప్రిల్‌ 19 నుంచి సెప్టెంబర్‌ 7 వరకు తలపెట్టిన పనులు పూర్తవుతాయు. పైఅధికారుల ప్రశంసలు అందుకుంటారు.

దాంపత్య జీవితం

మీన రాశికి చెందినవారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది. భాగస్వామి పట్ల శ్రద్ద వహించడం వల్ల అన్నిటిని కూడా చక్క బేడతారు.

బలహీనతలు
అస్పష్ట, నిస్సహాయ, గందరగోళం, అవిశ్వసనీయ, తప్పించుకొనేటువంటి బలహీన గుణాలు కలిగిన వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్నవాటిని కొన్ని కోల్పోతారు. కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చెలాయించటానికి చూస్తారు . అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవటంతో అతను తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది.

Image result for self confidence

అదృష్ట రత్నం
పుష్యరాగం, ఇంద్రనీలం, పచ్చరాయి వీరికి అదృష్ట రత్నాలు.

వ్యక్తిత్వం
ఈ రాశికి చెందినవారిలో ఉన్న చాలా మంచి గుణాలు… గందరగోళం, మూఢ విశ్వాసం, ఆదర్శవాదాల ముసుగులో కప్పబడి ఉంటాయి. అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు. స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.

ఆరోగ్యం
మీన రాశికి చెందిన వారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడతాయి. దీనికి కచ్చితమైన చికిత్సలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి . గుండెకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం.

Related image

ఇల్లు-కుటుంబం
మీన రాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తిస్థాయిలో తమపై వేసుకుంటారు. ఎటువంటి సమస్య వచ్చిన ముందు ఉండి నడిపిస్తారు . ఫలితంగా ఇంటా బయటా అందరి మన్ననలు పొందగలుగుతారు.5-11 స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల రుణ బాధలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం అధికంగా శ్రమించాలి. ఇంటి కోసం చేసే ఖర్చులు అధికమవుతాయి.