మకర రాశి ఫలితాలు 2018

1500

ఉత్తరాషాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందుతారు.

ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.మరి ఈ రాశి వారికీ 20 18 లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..

ఈ క్రింది వీడియో చూడండి.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం: 8, వ్యయం: 14; రాజపూజ్యం: 4, అవమానం: 5

వ్యాపారం

ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఆర్థిక స్థితి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.అక్టోబర్‌ 11 నుంచి లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఐతే 12వ స్థానంలో శని సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది.

Related image

వృత్తి, జీవిత గమనం

మకరరాశికి చెందినవారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయనాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు.అదేవిధంగా శిల్పకారులుగానూ, భవన నిర్మాణదారుగానూ కొనసాగుతారు. జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి వుండటం వల్ల వీరి జీవితం ఎటుంవంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి

ప్రేమ సంబంధాలు
ఈ రాశి వారికీ తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ.
ఒక్కొక్కసారి ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది వీటి చికాకులు కారణంగా ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు.. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

Image result for love marriage

అలవాట్లు
ఈ రాశికి చెందిన వారు చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు.చరిత్రాత్మక వస్తువులను సేకరిస్తారు.వీరు కొత్త వారి తో స్నేహం చెయ్యడానికి ఇష్ట పడతారు.

దాంపత్య జీవితం
అనుకూల దాంపత్యంతో మకరరాశివారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి.సంతన వృద్ది చెందే సూచనలు ఉన్నాయి..అనుకోని అర్థిక ఇబ్బందుల వల్ల వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

బలహీనతలు
మకరరాశివారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగిచూస్తుంటుంది. అదే సమయంలో ఏదైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు.తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

అదృష్ట రత్నం
మకరరాశికిచెందినవారి అదృష్ట రత్నం నీలం.ఈ నీలం రత్నాన్ని ధరించిన అన్నింటా విజయం చేకూరుతుంది.

వ్యక్తిత్వం
చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది. ఈ చంచెల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పట్నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది.

ఇల్లు-కుటుంబం
ఈ రాశి కి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. తీర్థయాత్రలు, దానధర్మాలకు, విలాసాలకు ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సలహాలతో ముందడుగు వేయాలి.

Related image

కలిసివచ్చే రోజు
మకరరాశివారి జాతక రీత్యా శని గ్హహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలసివచ్చే రోజుగా ఉంటుంది.ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.శుక్రవారం కాడా శుభదినమే.

అదృష్ట సంఖ్య
మకరరాశికి చెందినవారికి 4, 8 అదృష్ట సంఖ్యలు అయితే 1, 2, 9 అశుభ సంఖ్యలు.

అదృష్ట రంగు
మకరరాశికి చెందినవారికి ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూకలర్ వస్త్రానుధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.

Image result for blue colour

పరిష్కారం :

2018 లో అంతా బాగుంటుంది.. కాకపోతే ఎక్కువగా ఒత్తిడి తో ఉంటుంది .. కాబట్టి మానసిక ప్రశాంత కోసం శ్రీనృసింహస్వామి పూజిస్తే తప్పక శుభం జరుగుతుంది.