కుంభ రాశి ఫలితాలు 2018

2109
ఆధ్యాత్మిక విషయాల పట్ల నమ్మకాలు లేని వారు సైతం తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదేవిదంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి ఉంటుంది .. ఇందుకోసం పండితులు తన పుట్టిన తేదిని బట్టి లేదా జన్మ నక్షత్రమును బట్టి వారి రాశి అదే విధంగా వారి జతకంను చెబుతారు .. ఐతే ఇక్కడ మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి
ఈ క్రింది వీడియో చూడండి.

ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభ రాశికి చెందును.
కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనసును కలిగి ఉంటారు. సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊగిసలాడతారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది ఇది వీరి స్వరూపం .. ఐతే 2018 లో వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..
 శ్రీ విళంబి నామ సంవత్సరం లో  వీరికి  ఆదాయం: 8, వ్యయం: 14; రాజపూజ్యం: 7, అవమానం: 1
  వ్యాపారం
  కుంభ రాశి వారికి ఈ ఏడాది విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. వాహనం సమకూర్చుకుంటారు. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలం.
Related image
అర్థిక స్థితి :
ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థలనుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగి పోగలవు. గురువు వక్రగమనంలో ఉండే మార్చి – జూలై మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు
 వృత్తి, జీవిత గమనం
కుంభరాశి చెందిన వారు వృత్తి వ్యాపారాలములందు విజయవంతులుగా ఉంటారు.వీరి జీవితగమనం కూడా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు వైద్యవృత్తిలోనూ రాణిస్తారు. మొత్తంమీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. 9, 10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్‌ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం
Image result for foreign tour
ప్రేమ సంబందాలు :
 కుంభరాశివారు ప్రేమ ఊహల్లో తేలియాడతారు. అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నంలో విజయం సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఒకసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు. తాను ప్రేమించిన వారిపట్లు అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు.
 స్నేహం
 కుంభ రాశికి చెందినవారికి వృషభ, మిధున, కన్యా, తులా,మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు. కాగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు.
 అలవాట్లు:
 కుంభరాశికి చెందినవారు ఫోటోగ్రఫీ, కథలను చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపైన శ్రద్ధను చూపుతారు.కళల పట్ల వీరికి చాల ప్రేమ ఉంటుంది.
Related image
దాంపత్య జీవితం
కుంభరాశికి చెందినవారు ఏ సమస్యనైనా చిరు నవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవతం సాఫీగా సాగుతుంది.భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు. ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్నచిన్న స్పర్థలకు కూడా తావే ఉండదు. సంతానప్రాప్తికి అనుకూలం.
భాగస్వామి  సహకారంతో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
బలహీనతలు :
కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించటమేకాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించటమనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతురులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తన పంథాను మార్చుకోరు.
అదృష్ట రత్నం
కుంభరాశికి చెందినవారి అదృష్ట రత్నం నీలం.ఈ రంగు రత్నాన్ని కుంభరాశివారు ధరించినట్లయతే శని దేవుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు.
అరోగ్యం
కుంభ రాశికి చెందిన వారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఒకింత తట్టుకుని నిలబడగడిగే శక్తి ఉంటుంది. .అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ద ప్రదర్శించటం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఐతే వీరిని  ఉదర సంబంధమైన సమస్యలు బాధిస్తాయి.
Related image
 ఇల్లు-కుటుంబం:
వీరికున్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకూ విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతారు. 6-12 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.
కలిసివచ్చే రోజు
ఈ రాశి కి  చెందిన వారి జాతకంపై శనిగ్రహం ప్రభావం ఉంటుంది. కనుక వీరికి కలిసి వచ్చేరోజు శనివారంగా ఉంటుంది. శనిదేవుడు ఈ రోజును కుంభరాశికి చెందిన వారి పట్ల ప్రసన్నుడుగా ఉంటాడు. ఇంకా వీరికి మంగళవారం శుభప్రదంగానే ఉంటుంది. అదేవిధంగా ఆదివారం మధ్యమంగానూ ఉంటుంది. అయితే బుధవారం, శుక్రవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి
అదృష్ట సంఖ్య
కుంభరాశికి చెందిన వారికి 4 మరియు 8 సంఖ్యలు అత్యంత అదృష్ట సంఖ్యలు. 1,2,9 సంఖ్యలు మాత్రం వీరికి అశుభ సంఖ్యలుగా ఉంటాయి.
అదృష్ట రంగు:
కుంభరాశికి చెందిన వారు నీలం ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది.
Related image
పరిష్కారం :
మార్చి 10 నుంచి జూలై 10 వరకు గురువు వక్రించిన కారణంగా మీ పురోగతి చూసి అసూయపడే వారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం కావున వీటిని అధికమించాలంటే శ్రీదత్తాత్రేయ స్వామి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.