కన్య రాశి ఫలితాలు 2018

1341

కన్య రాశి వారు దుడుకు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్ధం చేసుకుంటారు మరి ఇలాంటి వారికీ 2018 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..

ఈ క్రింది వీడియో చూడండి.

ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందును.
శ్రీ విళంబి నామ సంవత్సరం వీరికి ఆదాయం: 14, వ్యయం: 2; రాజపూజ్యం: 6, అవమానం: 6

వ్యాపారం
రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది

ఆర్థిక స్థితి

మార్చి – జూలై మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు..

Image result for money

వృత్తి, జీవిత గమనం
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ఈ ఏడాది 4వ స్థానంలో శని గ్రహ సంచారం కారణంగా ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది.

ప్రేమ సంబంధాలు
ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్లాడటంవల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంటుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దటంలో సఫలం అవుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి.శని వక్రించిన ఏప్రిల్‌ 19 – సెప్టెంబర్‌ 7 తేదీల మధ్య మాత్రం ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు.

స్నేహం
స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు. అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమై సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు. స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పదించి అన్నీ ఏర్పాట్లతో ముందుంటారు.కొత్త స్నేహాలు చిగురిస్తాయి. విద్యర్తులైతే స్నేహాల వల్ల చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం వుంది

Image result for friends

అలవాట్లు
ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యేవిధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. సంగీతం వీరికి మరింత అందాన్ని కలిగిస్తుంది.

దాంపత్య జీవితం
ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడూ చిన్నపాటి మనస్ఫర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు.కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి.

బలహీనతలు
కన్యారాశికి చెందినవారిలో అతిగా విశ్లేషించేతత్వం, తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుకా ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన వత్తిడి, అశాంతికి గురై ఉంటారు.

అదృష్ట రత్నం
ఈ రాశివారికి కెంపు, ముత్యం, పగడపు రాళ్లలో ఒకదానిని ధరిస్తే మంచిది. దీనివల్ల తలపెట్టిన పనులు నిరాటంకంగా సాగిపోతాయి..

ఆరోగ్యం
ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతి కూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఉదర, చర్మ సంబంధింత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Image result for good health

ఇల్లు-కుటుంబం
ఈ రాశివారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వం తామై జీననాన్ని సాగిస్తారు. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం.

కలిసివచ్చే రోజు
కన్యారాశి వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితోపాటు ,శుక్ర, శనివారా లు కూడా అదృష్ట రోజులే. అయితే మంగళవారం మాత్రంఎ పని కూడా మొదలు పెట్టకూడదు.

అదృష్ట సంఖ్య
కన్యారాశివారి అదృష్ట సంఖ్య 5. దీనితోపాటు అయితే 3, 8, 9 అంకెలు అంతగా కలిసి రావు అనే చెప్పాలి.

అదృష్ట రంగు
ఈ రాశి వారి అదృష్ట రంగు తెలుపు, పసువు, ఊదాలు. ముఖ్యంగా తెలుపు రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరతాయి.

Image result for white colour

పరిష్కారం :
వీరికి ఈ ఏడు శుక్ర, శనివారాల నాడు శ్రీ మహావిష్ణువు ఆరాధన ఎర్రటి పూలతో చేస్తే మంచి లాభం కలుగజేస్తుంది.