తులా రాశి ఫలితాలు 2018

1367

తుల రాశి వారు అందరిని తమ తో కలుపుకుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు మరి వీరికి 20 18 విళంబి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..

చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులా రాశికి కిందకు వస్తారు.
శ్రీ విళంబి నామ సంవత్సరం వీరికి ఆదాయం: 11, వ్యయం: 5; రాజపూజ్యం: 2, అవమానం: 2

వ్యాపారం
వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి చాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఐతే వీరికి పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటంవల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టటానికి వీరు కృషి చేస్తారు. తులా రాశి వారు ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. ఉన్నత చదువులు, విదేశీ యానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.

Image result for job holder

ఆర్థిక స్థితి

ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అక్టోబర్‌ 11 నుంచి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు.వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది.

Image result for money

వృత్తి, జీవిత గమనం
టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా వీరు ఉన్నతస్థాయికి వెళ్లగలరు. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మార్చి – జూలై మాసాల మధ్య అశాంతికి లోనవుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.3వ స్థానంలో శని సంచారం ఫలితంగా బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి.

ప్రేమ సంబంధాలు
తులారాశివారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయ బద్దమైన వీరి ఆలోచనలపట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు. స్నేహితులతో కలిసి తిరగడంమంటే చాల ఇష్టం . స్నేహంకోసం ఎంత ఖర్చునైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడుగా కనిపిస్తారు.శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

అలవాట్లు
వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తారు. అలాగే విదేశీ విహారం, విహార యాత్రలు వంటి వాటిపైనా ప్రత్యేక ఆసక్తిన కలిగి ఉంటారు.

దాంపత్య జీవితం
తులారాశికి చెందినవారిలో ఎక్కువమంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. బాంధవ్యాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం.

Related image

బలహీనతలు
తులారాశివారిలో ప్రధాన బలహీనత వీరి మనసు విరి మాట వినదు. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం. అతిరాజీ స్వభావంతోపాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి.

అదృష్ట రత్నం
వీరు పగడం, గోమేధికం, పుష్య రాగం రాళ్లలో ఏదైనా ఒకరాయిని ధరించాలి. వీటిని ధరించటంవల్ల అనుకున్న పనులు సత్వరం జరుగుతాయి. సత్ఫలితాలు చేకూరతాయి.

ఆరోగ్యం
ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ద చూపించరు. విద్యార్థులకు చదువుల పట్ల అఽశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి.ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది.

Related image

ఇల్లు-కుటుంబం

కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం . . ఇల్లాలు అంటే వీరికి ఇష్టం. ఆమె చెప్పినమాటను జవదాటరు. దీనితో కుటుంబం మరింతగా విస్తరిస్తుంది.

కలిసివచ్చే రోజు
వీరికి మంగళ, బుధ, శుక్ర వారాలు బాగా కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది.

అదృష్ట సంఖ్య
సంఖ్యా శాస్త్రం ప్రకారం తులారాశికి చెందినవారి అదృష్ట సంఖ్య 6. అదేవిధంగా 4, 5, 8 అంకెలు కూడా శుభాన్ని తెచ్చిపెడతాయి. అయితే 1,2 అంకెలు అంత మంచివి కావు.

అదృష్ట రంగు
తులా రాశివారికి కలిసివచ్చే రంగు పసుపు. ఆరంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల వీరికి అన్నింట శుభం కలుగుతుంది.

పరిష్కారం :

ప్రతి శుక్ర వారం అమ్మవారి గుడి లేదా విష్ణు దేవాలయలో ఉండే నవగ్రహలకు పూజ చెయ్యడం చాల మంచిది ..