2018 మిధున రాశి ఫలితాలు

1281

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది.ఈ పన్నెండు రాశులలో మూడోవధైనా మిధున రాశి గురించి తెలుసుకుందాం.. ఈ రాశి వారికీ 20 18 సవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం ..

ఈ రాశి వారికీ ఆదాయం: 14, వ్యయం: 2; రాజపూజ్యం: 4, అవమానం: 3 మిథున రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది.

స్వభావం
మిధున రాశికి చెందినవారు తేజోవంతులుగానూ, సౌందర్యవంతులుగానూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు.

వ్యాపారం
ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు.సిమెంటు, భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి.పెద్దల సలహాలతో కృషి రంగంలో విజయం సాధిస్తారు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు.

ఆర్థిక స్థితి

ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. గురువు వక్రగమనంలో ఉన్న మార్చి 10 – జూలై 10 మధ్య ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది అక్టోబర్‌ 12 నుంచి గురువు తులారాశిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.

వృత్తి, జీవిత గమనం

విద్యార్థులకు శుభప్రదమైన కాలం. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. మార్చి – జూలై మాసాల మధ్య పెట్టుబడులు లాభిస్తాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి.భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఈ ఏడాది దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపార రంగంలో అంచనాలు తలకిందులవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆస్తిపాస్తుల విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు

ప్రేమ సంబంధాలు
ప్రేమానుబంధాలు బలపడతాయి. వీరు ఎవరిపట్లయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించినవారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమవంతు సాయం అందిస్తారు.

అలవాట్లు
మిధునరాశికి చెందిన వారికి సినిమాలు, పుస్తకాలను చదవటం, ఈతకొట్టటం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్లగలుగుతారు.

దాంపత్య జీవితం
మిధునరాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు.సప్తమ స్థానంలో శని సంచారం ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం వుంది.

బలహీనతలు
మిధునరాశికి చెందినవారు నిలకడగాలేని మనస్తత్వం కలిగి ఉంటారు. లక్షణం వీరిలోని ప్రధాన బలహీనత. దిని వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి అందకుండా పోతాయి.

అదృష్ట రత్నం
మిధునరాశికి చెందినవారికి పచ్చ అదృష్ట రత్నం. బుధవారం ఈ రాయిగల ఉంగరాన్ని ధరించి ఏ కార్యాన్నయినా తలపెడితే విజయవంతమవుతుంది.

ఆరోగ్యం
మిధునరాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావటంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి.గురువు వక్రగమనంలో ఉన్న మార్చి 10 – జూలై 10 మధ్య ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

ఇల్లు- కుటుంబం
వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యల లెక్కలో చూస్తుంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఐతే బంధు, మిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది.

కలిసివచ్చే రోజు
మిధునరాశివారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసివచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి గురువారం కూడా కలిసివచ్చే రోజుగానే ఉంటుంది. అయితే సోమవారం వీరికి అశుభం కాబట్టి సోమవారం నాడు ఏమి చేపట్టకపోవటమే మంచిది

అదృష్ట సంఖ్య
ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. దీనితోపాటు 14, 23, 32, 41, 50, 59, 68… సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే.అయితే 3, 8, 9 అంకెలు అశుభ అంకెలు.

అదృష్ట రంగు
మిధున రాశికి చెందిన వారికి నారింజ రంగు కలిసివచ్చే రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించటం ద్వారా వీరు మానసిక ప్రశాంతిని పొందగలరు.

పరిష్కారం :

2 – 8 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఖర్చులు మీ అంచనాలు మించుతాయి. భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఈ ఏడాది దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపార రంగంలో అంచనాలు తలకిందులవుతాయి. వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల చిక్కులు తొలగుతాయి ..