2018 కర్కాటక రాశి ఫలితాలు

1560

2018 విళంబి నామ సంవత్సరం లో కర్కాటక రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..
పునర్వసు నక్షత్ర 4 వ పాదం , పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం: 8, వ్యయం: 2; రాజపూజ్యం: 7, అవమానం: 6

స్వరూపం
కర్కాటకరాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు. అందంగానూ,ఆకర్షిణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు.

   

వ్యాపారం
కర్కాటక రాశివారు వ్యవసాయం, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు. రాశి వారు ఈ సంవత్సరం స్థల సేకరణ, గృహనిర్మాణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు పురోగతి సాధిస్తారు. వీరికి వివిధ రంగాలలో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది. దానివల్లే వ్యాపారాలు చేస్తూఉంటారు.

ఆర్థిక స్థితి
ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరుఫున ఆస్తులు కలిసివస్తాయి. అయితే వాటిని ఉపయోగించుకోవటానికి ఇద్దరూ విముఖత చూపిస్తారు. ఈ ఏడాది 4వ స్థానంలో బృహస్పతి గ్రహం సంచరిస్తుంది. ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు..వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మార్చి – జూలై మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి.

స్వభావం
ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు.వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు. ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేధిస్తూ ఉంటారు. సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది.

ప్రేమ సంబంధాలు
కర్కాటరాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు. ఎవరితోనైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు. తమకు నచ్చిన పద్ధతిలో వారి ఇష్టప్రకారం నడుచుకుంటారు. ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

స్నేహం
కర్కాటక రాశి వారికి ఇతర రాశులైన వృషభం, మీనం, వృశ్చికం, కన్యా రాశుల వారితో స్నేహంగా ఉంటారు .

అలవాట్లు
ఈ రాశికి చెందిన వారి అలవాట్లు విభిన్నమైన అలవాట్లను కలిగి ఉంటారు.ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు. నాటకాలు, పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందిన వారు ఉంటారు. అదే విధంగా సినిమాలలో ప్రవేశిస్తే తప్పక విజయం సాధిస్తారు.

దాంపత్య జీవితం
ఈ యేడాది 1 – 7 స్థానాల్లో రాహు కేతు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు చేస్తారు. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. రుణబాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. భార్యాభర్తలు ఒకురికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాలనుంచి గట్టెక్కటానికి తాను పొదిపు చేసిన సొమ్మును అందిస్తుంది.

బలహీనతలు
అతిగా ఆందోళన చెందటం,ఎక్కువ కోపాన్ని కలిగి ఉంటారు. ఈ రెండు గుణాల వల్ల ముందు వెనక ఆలోచచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. క్షమాగుణంలేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

అదృష్ట రత్నం
ఈ రాశికి చెందినవారికి నీలం రంగు వజ్రం అదృష్టాన్నిచ్చే రత్నం. దీనిని ధరించటం వల్ల సమస్త శుభాలు కలగటంతోపాటు ధనలాభం కలుగుతుంది.

వ్యక్తిత్వం
చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది. ఈ చంచెల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు.
పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా వుంటాయి.

ఆరోగ్యం
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. రుణబాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

ఇల్లు- కుటుంబం
తమ కుటుంబం పట్ల విరి వైఖరి బిన్నంగా ఉంటుంది .. కొన్ని అనుకోని ఘటనలు జరగడం ఇందుకు కారణం. తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు. తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడటం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు.

కలిసివచ్చే రోజు:
ఈ రాశి వారికి శుక్రవారం చాలా మంచిరోజు. ఆ రోడజు ఏ పనులు ప్రారంభించినా వారికి లాభం చేకూరుతుంది.

అదృష్ట సంఖ్య
కర్కాటకరాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు 2 లేదా 7 అంకెలు. వాటితోపాటు 11, 20, 29, 38, 47 సంఖ్యలు కూడా వీరికి అదృష్ట సంఖ్యలుగా పరిగణించబడతాయి.

అదృష్ట రంగు
కర్కాటకరాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు. ఈ రంగు రుమాలును తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది.

పరిష్కారం :

శని వారం లేదా శుక్ర వారాలలో విష్ణువు లేదా శ్రీరామచంద్రమూర్తి ఆరాధనతో సత్ఫలితాలొస్తాయి.