2018 మేష రాశి ఫలితాలు

2093

భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అందరికి వుంటుంది .. రేపు తన జీవితం ఎలా ఉండబోతుందో అనే విషయం పై ప్రతి ఒక్కరికీ ఆసక్తే. మాములుగా తెలుగు సంవత్సరం అయిన ఉగాది రోజున పంచాంగం చెప్పబడుతుంది .. అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి ఎ రాశి .. ఆ రాశి కొత్త సంవత్సరం లో జీవితం ఎలా ఉండబోతుంది . ఇవ్వన్ని కూడా చెబుతారు పండితులు ..ఇక ఇప్పటికే 2017 సంవత్సరం అనగా హమలంబి గడిచి 2018 లో విళంబి నామ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాం .. ఆధునిక పరిజ్ఞానం ప్రకారం .. ఇది 2018 లో నిపుణులు కొన్ని లెక్కలు కట్టారు .. దాన్ని బట్టి ఈ ఏడాది రాశులు ఎలా ఉండబోతున్నాయో వివరించారు .. 12 రాశుల్లో మొదటిది అయిన రాశి మేష రాశి.. ఈ ఏడాది ఈ రాశి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..

 

మేష రాశి :
ఆదాయం: 2, వ్యయం: 14; రాజపూజ్యం: 5, అవమానం: 7 ఈ ఏడాది మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది

ఈ రాశి వారి స్వరూపం ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు.వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.విరు చాల మృదు స్వభావులు. దయ జాలి ఎక్కువగా ఉంటాయి .

వ్యాపారం : 

మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటాయి . వీరి శక్తి సామర్థ్యాలను అవసర సమయాల్లో ఉపయోగించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశివారు బాగా రాణిస్తారు.

అదే విధంగా సూపర్ మార్కెట్లు లాంటి వ్యాపారాలు ప్రారంభించినా మంచి లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు.

మేష రాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు.దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు.

సంపద :

మేష రాశికి చెందిన వారికి ఈ ఏడు అంత శుభమే జరుగుతుంది. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. మొదటి రెండు నెలలు ఆరోగ్యపరంగా సులభంగా ఉండకపోవచ్చు. ఆదాయం మాత్రం పెరుగుతుంది. కెరీర్‌పరంగా పురోభివృద్ధి ఉంటుంది.శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఏర్పడును. మాసాంతంలో ఆర్ధిక పరంగా వృద్ది. వాహన సంభందిత వ్యయం ఏర్పడును. విద్యార్ధులకు మంచి కాలం కాదు. విద్యావిఘ్నములను ఏర్పరచు సూచన. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు.

స్వభావం :

మేషరాశి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగాను,స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు.ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరికి చాల స్వార్ధపరులై ఉంటారు. ఐతే ఎవరైనా రెచ్చ గొడితే పనులు అర్దాంతంగా వదిలిపోయేవారయి, సహనం వీరిలో ఎ మాత్రం ఉండదు .. 2017 విరి స్వార్థం వల్లనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ..దాంతో 2018 దాన్ని మార్చుకోడానికి ప్రత్నిస్తారు.

వృత్తి, జీవిత గమనం

మేషరాశిలో జన్మించినవారు జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నత వ్యక్తులగానో, ప్రముఖలు గానో చెలామణి అవ్వాలని కోరుకుంటారు. దీనికి కారణం లేకపోలేదు ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం ఎప్పుడుకూడా ఎక్కువగా ఉంటుంది . వీరు రాజకీయాలలో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా బాగా రాణిస్తారు . ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు.ఐతే ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ, వ్యాపార సంబంధిత విషయాల్లోనూ మేషరాశివారిపై శని ప్రభావం ఉంటుంది. మీ శత్రువులు మిమ్మల్నినష్టపరిచేందుకు, మిమ్మల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. అందువల్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. శని మిమ్మల్ని వెంటాడుతుంది.

ప్రేమ సంబంధాలు :

ఈ రాశివారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది , ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించటమే కాడుండా వారినుంచి ప్రేమను సైతం పొందుతారు. ఐతే వీరు ప్రేమ లో విఫలం అయితే మాత్రం తట్టుకోలేరు. ఆంటే ప్రేమవల్ల బాధపడాల్సి ఉంటుంది.

స్నేహం

మేష రాశి వారికీ వృషభ, మిధున, కన్యా, తులా,మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు. కాగా కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు.మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు. వీరంతా దాదాపు ప్రాణమిత్రులని చెప్పవచ్చు… ఆర్థికంగా విరు ఈ ఏడాది బాగుంటారు .. కాబట్టి కొంత వరకు అందరు కూడా విరి పైనే ఆధారపడతారు.

అలవాట్లు
వీరికి సవాళ్లుగా ఉన్నటువంటివాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్నిహాబీగా స్వీకరిస్తారు. వీరికి కళల పట్ల కూడా మక్కువగా ఎక్కువగా ఉంటుంది .. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించటం కూడా హాబీగా ఉంటుంది.. ఇక విద్యార్థులు ఈ ఏడు మంచి ఫలితాలు సాదిస్తారు. కళారంగం లో ఉన్న వారు మంచి విజయాలు అదేవిధంగా గుర్తింపు కూడా లబిస్తుంది.

దాంపత్య జీవితం
సుఖసంతోషాలు లోపించినట్లుగా భావించడం వల్ల కుటుంబజీవితం గందరగోళంగా మారుతుంది.. పిల్లల ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉండొచ్చు. వైవాహిక జీవితంలో మరింత సమయం, అంకితభావం ప్రదర్శించాలి. ఇతరుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. పని నుంచి అప్పుడప్పుడు వేరుపడినా తిరిగి టార్గెట్ ను గుర్తుచేసుకుని ట్రాక్ లోకి రావడం ద్వారా మంచి పురోభివృద్ధి సాధిస్తారు.
వీరిపై మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండంటంవల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనస్సులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి.

బలహీనతలు
ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టిపెడతారు. వీరికి కాస్త కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు .వీరికి తప్పు చేసిన అందరి ఎదుట ఒప్పుకొనే గుణం తక్కుగా ఉంటుంది .. ఎదుకంటే విరి చాల మొహమాట పడుతుంటారు.

అదృష్ట రత్నం:

మేషరాశికి చెందినవారి అదృష్ట రత్నం నీలం.ఈ రంగు రత్నాన్ని మేషరాశివారు ధరించినట్లయతే శని దేవుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే 2018 లో వీరిని శని వెంతడుతుంటాడు కాబట్టి ఆయన్ను ప్రసన్నుడిని చేసుకోవడం ముఖ్యం . ఈ నీలం రత్నాన్ని ధరించిన మేషరాశి వారికి అన్నింటా విజయం చేకూరుతుంది.

విద్య
మేషరాశికి చెందిన వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇష్ట పడతారు.. ఇంజినీరింగ్, వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు.వారు ఎంచుకున్న దేన్నైనా పట్టుదల తో సాదిస్తారు.

ఆరోగ్యం:

రాశి వారికీ కొద్ది పాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.. విరి పనుల్లో మునిపోతారు కాబట్టి టైం కి తినడం తగ్గిస్తారు ఆ కారణంగా వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆస్త్మా వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వీరిని చిన్నతనంలోనే బాధిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు మెండు. కనుక ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది .

ఇల్లు- కుటుంబం:

ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అందరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు.దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూ.చ తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగినవారుగా ఉంటారు.. ఎప్పడు కూడా ఇంట్లో వీరికే ఎక్కువగా ప్రాదాన్యత ఉంటుంది.

కలిసివచ్చే రోజు
విరి పై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరికి మంగళవారం బాగా కలిసివస్తుంది అలాగే గురువారం,ఆదివారం కూడా కలిసివచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం వీరు ఎ పని మొదలు పెట్టరాదు.

అదృష్టమైన సంఖ్య

మేషరాశి చెందినవారికి 9 సంఖ్య అత్యంత అదృష్టమైన సంఖ్య. ఆ తర్వాత వరుసగా 9తో గుణించబడే 18, 27, 36, 45, 54, 63… వంటి సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే

అదృష్ట రంగు:
మేషరాశికి చెందిన వారు ఎరుపు లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలును చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది.

పరిష్కారం :
మంగళ వరం , గురువారం కూడా నియమాలు పాటిస్తే మంచిది .. ప్రతి మంగళ వారం మంగళ గ్రహానికి అదే విధంగా సుబ్రమణ్య స్వామి కి పూజలు చెయ్యడం వల్ల ఒత్తిడి తొలగి పోయి మానసిక ప్రశాంతత కల్గుతుంది.