చిలుకూరు బాలాజీ గుడికి వెళ్తున్నారా ?అయితే ఈ వీడియో వెంటనే చూడండి

963

చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రోజూ 20 – 30 వేల మంది భక్తులు, సెలవుదినాలలో 30 -50 వేల మంది భక్తులు వేంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత.

Image result for chilkur balaji temple

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లివచ్చేవాడట. అయితే, కొంత కాలానికి ఆయన జబ్బుపడి తిరుపతికి వెళ్లలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వరస్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట.
ఒకప్పుడు స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చెబుతాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్టించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట.

Related image

వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం త‌ర్వాత‌ ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకొనే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి స్వామి వారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా వి.ఐ.పి. దర్శనం, టిక్కెట్ దర్శనం అంటూ ఏమీ వుండదు. ప్రధాన మంత్రి అయినా సరే మాములు దర్శనం చేసుకోవలసిందే. ప్రస్తుతం ఏ దేవాలయంలో చుసిన హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు.ఇతర దేవాలయాలలో హారతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు. ఇక్కడ కానుకలు వేయరు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కల్గుతుందనే నమ్మకమూ ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇక్క‌డ ఇప్పుడు హుండీలేక‌పోవ‌డంతో స్వామికి కానుక‌లు ఇవ్వాలి అంటే ఎలా అని అంద‌రూ అనుకుంటున్నారు.. కాని ఇక్క‌డ ఇప్పుడు తెలంగాణ అంతా మొక్క‌లు పెంప‌కం పెద్ద ఎత్తునచేస్తున్నారు అందులో భాగంగా స్వామికి మొక్క‌లు ఇచ్చి ఆయ‌న పేరు మీద ఉన్న గార్డెన్ లో పెంచే విధంగా చేయాలి అని కూడా అధికారులు చూస్తున్నార‌ట‌.. ఇలా చేయ‌డం వ‌ల్ల ఈ ప్రాంతం మ‌రింత ప‌చ్చ‌ద‌నంతో ఆహ్లదంగా మారుతుంది అని అంటున్నారు భ‌క్తులు. మ‌రి ఇది కాని జ‌రిగితే చాలా సంతోష‌క‌ర‌మే అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.