కేరళ వరదల్లో అనంత పద్మనాభ స్వామీ గుడి వద్ద అధ్బుతం

605

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.అయితే ఇంత విలయతాండవంలో కూడా కేరళలో ఒక అధ్బుతం జరిగింది.దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే నిదర్శనం.మరి ఆ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for kerala flood antha padamaswami temple

కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు,కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి..ఇప్పటికి కూడా అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.రోజురోజుకు నీటి మట్టం పెరగడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ఇలాంటి సమయంలో కేరళలోని అనంత పద్మనాభస్వామీ ఆలయం వద్ద మహాద్భుతం చోటు చేసుకుంది.కేరళ మొత్తం ఇంత భీభత్సం ఉన్నా కూడా ఇప్పటికి కూడా అనంత పద్మనాభ స్వామీ గుడి దగ్గరకు మాత్రం నీరు రాలేదు.ఆలయం చుట్టుముట్టు నీరు ఉన్నాయి కానీ ఆలయం లోపలికి మాత్రం నీరు అస్సలు చేరలేదు.

Image result for kerala flood antha padamaswami temple

ఇది నిజంగా అద్భుతం అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.అందుకే ప్రజలు అందరు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆలయం లోపలికి వెళ్తున్నారు.అలాగే తిరువనంత పురం గ్రామం మొత్తం నీరు చేరుకోవడంతో ప్రజలు ఇళ్ళ మీదికి వెళ్లి ప్రాణాలను చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.అయితే ఇలాంటి సమయంలో ఆ వరద నీరులో ఒక అధ్బుతం చోటు చేసుకుంది.ఒక పడవలాంటి ఆకారంలో ఉన్న వస్తువు ఆ వరద నీరులో కొట్టుకొచ్చింది.అది చూసి అందరు పడవ అనుకున్నారు.అయితే ఆలయం లోపలికి నీరు రావడం లేదని తెలుసుకున్న అక్కడి జనం ఎలాగైనా ఆ పడవ సహాయంతో పద్మనాభ స్వామీ ఆలయం దగ్గరకు వెళ్ళాలి అనుకున్నారు.అలా చాలా మంది ప్రజలు ఆ పడవ సహాయంతో ఆలయం దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు.

పడవ అయితే ఎక్కారు కానీ ఆ వరద నీటి దాడికి అది గుడి దగ్గరకు తీసుకువెళ్తుందో లేదో అనే అనుమానం ఉండేది.ఏది అయితే అది అవుతుంది అని ఆ పడవ ఎక్కారు.అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆ పడవ నేరుగా పద్మనాభ స్వామీ గుడి దగ్గరకు తీసుకెళ్ళింది.అలా దగ్గర దగ్గర 50 మందిని దాకా కాపాడింది.అయితే ఆ గుడి దగ్గరకు వచ్చాకా అందరు దిగి వెళ్లిపోయాకా ఆ పడవ ఒక్కసారిగా మాయమయిపోయింది..ఇది చూసి అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇంతమందిని ఎక్కినా కూడా ఏమి కాలేదు కానీ మనమందరం దిగాకా ఆ పడవ మునిగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. మనల్ని కాపాడటానికే ఆ పద్మనాభ స్వామీ ఆ పడవను పంపి ఉంటాడని ఆ ప్రజలు అనుకుంటున్నారు.ఇక ఆలస్యం చెయ్యకుండా అందరు కలిసి దేవుడి గుడి లోపలికి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.మరి ఈ సంఘటన గురించి మీరేమంటారు.పద్మనాభ స్వామీనే కాపాడారని అనుకుంటున్నారా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.