12 ఏళ్ళ కొకసారి మహాఅధ్బుతం: 9 రోజులు గుడి మూసివేతకు కారణం ఇదే

935

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భక్తుల నమ్మకం.రోజు కొన్ని లక్షల మంది ఈ దేవాలయం దర్శనానికి వస్తారు.అయితే ఈ గుడిని ఇప్పుడు తొమ్మిది రోజులు మూయబోతున్నారు.మరి ఎందుకు మూస్తున్నారు భక్తులకు ఎందుకు దర్శనం నిలిపెస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for tirupati venkateswara swamy

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది.తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంపై చర్చించేందుకు ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేయనున్నారు.

Image result for tirupati venkateswara swamy

ఈ తొమ్మిది రోజల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా స్పష్టం చేశారు. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండడం భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Image result for tirupati venkateswara swamy

తిరుమల కొండపై 12వ తేదీ నుంచి వైదిక కార్యక్రమాలు జరపాల్సి ఉండగా 9వ తేదీ నుంచే భక్తుల రాకను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. దీనిపై ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో సింఘాల్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు. అప్పట్లో తిరుమలకు రోజూ 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారని, దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని తెలిపారు.ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఒకవేళ పరిమితంగా అనుమతించినా.. రోజుకు 20 వేలమందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందని, మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని తెలిపారు.

దీనికి తోడు 10, 11 తేదీల్లో ఒకవేళ భక్తులకు దర్శనానికి అనుమతిస్తే రెండు రోజుల పాటు కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో రెండు రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేసినట్లు తెలిపారు.తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఉండదు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ మాజీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.టీటీడీ నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తిరుమల పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు భక్తులకు శ్రీవారి దర్శన నిలిపివేత గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.