శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అరవణి గురించి ఈ 11 నిజాలు తప్పక తెలుసుకోండి!

594

దేశంలో శివుడు, విష్ణువు వేర్వేరుగా ఆలయాలు ఉంటాయి. అలాంటి శివకేశవులు కలిసుండే క్షేత్రాలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది శబరిమల. పశ్చిమ కనుమల్లో ఉన్నా శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి కొలువుంటారు. అయ్య (విష్ణువు), అప్ప (శివుడు) అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం జనించిందని అంటారు. శివకేశవుల క్షేత్రంగా విరాజిళ్లుతోన్న శబరిమలకు ఏటా లక్షలాది భక్తులు వస్తారు. మాలను ధరించి, 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేసి, ఇరుముడి కట్టుకుని స్వామి దర్శనానికి బయలుదేరుతారు. పంబలో స్నానం చేసి నీలమలను దాటి శబరిగిరికి చేరుకుంటారు. ఇరుముడిలో బియ్యం, కొబ్బరికాయ, నెయ్యిని ఉంచుతారు. నల్లని వస్త్రంలో ఇరుముడికి సంబంధించిన వస్తువులను ఉంచి మూటగా కట్టి భక్తులు నెత్తిన పెట్టుకొని శబరిక్షేత్రం చేరుకుంటారు. తిరుపతి లడ్డూకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. అయ్యప్పస్వామి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత కలిగిన శబరిమల ప్రసాదం గురించి కొన్ని ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి

 1. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న స్వాములు తీసుకొచ్చే అయ్యప్ప ప్రసాదం పేరు అరవణి ప్రసాదం. డబ్బాల్లో విక్రయించే ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది.
 2. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవణ పాయసం, అప్పం తప్పకుండా తీసుకుంటారు.
 3. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఈ ప్రసాదం తయారు చేస్తారు. అనేక పోషక పదార్ధాల మిలితం అయిన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 4. ఇందులో అనేక పోషక పదార్ధాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతగానో మంచిది. చలికాలంలో ఈ ప్రసాదం శరీరంలో వేడిని కలిగిస్తుంది.
 5. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి.
Image result for ayyappa swami prasadam
 1. ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని కనీసం రెండు నుంచి పది లక్షల మండి దర్శించుకుంటారని అంచనా.
 2. భక్తుల కోసం ప్రతి ఏడాది 80 లక్షల అరవణ ప్రసాదాన్ని తయారు చేస్తారట.
 3. తిరుమల తరువాత అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం. తిరుమల లడ్డు తర్వాత అరవణి ప్రసాదానికి అంత పేరుంది.
 4. దేవస్వామ్ బోర్డు పరిధిలోని మావెలిక్కర చెట్టికులంగర దేవి ఆలయం నుంచి ప్రసాదం తయారీకి అవసరమైన బియ్యం సరఫరా అవుతాయి.
 5. ఒక్కో డబ్బా 250 గ్రాముల బరువు ఉంటుంది.
 6. ప్రసాదం తయారీకి సంబంధించి నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకుగాను మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ సభ్యులను సలహాదారులుగా దేవస్వామ్ బోర్డు నియమించింది.
Image result for ayyappa swami prasadam

ఇవేనండి శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. మరి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యని. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.