కేరళ లో అధ్బుతం: బయటపడ్డ 100Kgల బరువైన అయ్యప్ప విగ్రహం.. చుట్టూ వేల పాములు కాపలా

695

వరద ముప్పు నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగతున్నాయి. పది రోజులకుపైగా కొనసాగిన భారీ వర్షాలు.. కేరళకు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు రావనే వార్త మళయాళీలకు ఊరటనిచ్చింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర విధ్వంసానికి గురైన కేరళను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలతోపాటు సామాన్యులు సైతం ముందుకొస్తున్నారు.అయితే ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది దీన స్థితిలో బతుకుతున్నారు.అయితే వరదల సమయంలో ఒక పాము చేసిన సాయం గురించి ఇప్పుడు ఒక వార్త హల్చన్ చేస్తుంది.అదేమిటి అంటే 100 kg ల బరువైన విగ్రహం బయటపడింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for ayyappa swamy images in kerala with snake

అది కేరళలోని కన్నూర్ కు దగ్గరలో ఉన్న ఒక కుగ్రామం.ఈ గ్రామం అడవిలో చాలా ఎత్తు కొండ మీద ఉంటుంది.ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలంటే ఎన్నో కొండల నడుమ నుంచి వెళ్ళాలి.అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు భయపడి అక్కడి జనం ఆ గ్రామాన్ని ఖాళీ చేసి సహాయక కేంద్రానికి వెళ్ళారు.ఆ గ్రామంలో ఎవ్వరు లేరు.అయితే వారు వెళ్ళిన తర్వాత ఆ గ్రామం మొత్తాన్ని వరద ముంచెత్తింది.ఇళ్లన్నీ నీళ్ళలో మునిగిపోయాయి.చెట్లు అన్ని వరదల దాడికి కొట్టుకుపోయాయి.అక్కడ వరద ఎంత పెద్దగా వచ్చిందంటే వరద ధాటికి కొండల మీద ఉన్న మట్టి మొత్తం మాయమైపోయి కేవలం రాళ్ళు మాత్రమే మిగిలాయి.ఇంత పెద్ద వరద ధాటికి అక్కడ ఒక మహాద్భుతం చోటు చేసుకుంది.ఆ గ్రామం ఉంటున్న కొండల మద్య ఎప్పుడు వెలసిందే తెలియదు లేక అక్కడ ఎప్పటినుంచి ఉంటుందో తెలియదు కానీ ఒక భారీ విగ్రహం బయటపడింది.అది అయ్యప్ప స్వామీ విగ్రహం.దగ్గర దగ్గర 100 kg ల బరువు ఉంటుంది.

Image result for ayyappa swamy images in kerala with snake

గత రెండు రోజులుగా కేరళలో వర్షాలు తగ్గిపోయాయి.వరదల దాడి కూడా తగ్గిపోయింది.కాబట్టి పునరావస కేంద్రాల నుంచి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్తున్నారు.అలా ఆ గ్రామ ప్రజలు కూడా తమ ఇళ్ళ దగ్గరకు వెళ్తున్నారు.వెళ్తున్న సమయంలో వారికి ఊరి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో ఈ అయ్యప్ప స్వామీ విగ్రహం కనిపించింది.అయితే ఆ అయ్యప్ప స్వామీ విగ్రహం చూసి వాళ్ళు ఒక్కసారిగా భయపడ్డారు.స్వామీ విగ్రహాన్ని చూసి ఎందుకు భయపడ్డారు అని అనుకుంటున్నారా..అది కేవలం అయ్యప్ప స్వామీ విగ్రహం మాత్రమే కాదు.ఆ విగ్రహం చుట్టూ కొన్ని వందల సంఖ్యలో పాములు ఉన్నాయి.ఆ పాములన్నీ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి.ఈ ఘటన చూసి అక్కడి స్థానికులు షాక్ అయ్యారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మనం ఇన్ని రోజుల నుంచి ఉన్నాం మనకు ఎప్పుడు ఈ విగ్రహం కనిపించలేదు కదా ఆశ్చర్యపోతున్నారు. వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు.అధికారులు వచ్చి ఆ అయ్యప్ప స్వామీ చుట్టూ ఉన్న పాములను చూసి షాక్ అయ్యారు.వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు చెప్పగా వాళ్ళు వచ్చి ఆ పాములను తీసుకెళ్ళారు.తర్వాత అధికారులు అయ్యప్ప స్వామీ విగ్రహాన్ని స్వాదీనం చేసుకున్నారు.అయితే ఆ విగ్రహం ఎన్నేళ్ళదో దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.చూడాలి మరి విగ్రహం గురించి ఏం తెలుస్తుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళ వరదల గురించి ఆ వరదల వలన బయటపడిన ఈ అయ్యప్ప విగ్రహం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.