మంత్రాలయం రాఘవేంద్రస్వామి విశిష్టత – చరిత్ర

179

మన రాష్ట్రంలో అనేక పుణ్య క్షేత్రాలు ఉన్నాయి అందులో మఠాలు కూడా ఉన్నాయి ..వాటిలో ఎక్కువగా అందరూ దర్శించే మఠం రాఘవేంద్రస్వామి వారి మంత్రాలయం.. శ్రీ‌శ్రీ‌శ్రీ రాఘ‌వేంద్రస్వామి కొలువు తీరిన మంత్రాల‌యం నిత్యం భక్తులతో కనుల పండుగగా ఉంటుంది.. దేశ విదేశాల నుంచి స్వామి మఠాన్ని బ్రందావనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వేలాదిగా భక్తులు తరలివస్తారు. నటులు రాజకీయ నేతలు సెలబ్రెటీలు ఎందరో స్వామికి భక్తులుగా ఉన్నారు. పచ్చటి శోభతో నదీ తీరాన ఉన్న స్వామి క్షేత్రం పై ఈరోజు స్పెషల్ స్టోరీ.

Image result for మంత్రాలయం

ఈ ప‌విత్ర‌మైన భూమిపై ఎంద‌రో యోగులు..రుషులు..మ‌ఠాధిప‌తులు న‌డ‌యాడారు. ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితంతో విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి క‌డ‌దాకా నిలిచారు. అలాంటి పీఠాధిప‌తుల్లో ఒక‌డిగా..దైవంగా భ‌క్తుల ఇలవేల్పుగా శ్రీ రాఘేవంద్ర స్వామి కొల‌వ‌బ‌డుతున్నారు. లెక్క‌లేనంత మంది భ‌క్తులు నిత్యం ఆయ‌న‌ను స్మ‌రించుకుంటారు. ఆల‌యాల్లో..మ‌ఠాల్లో ..ఆశ్ర‌మాల్లో..ఎక్కువ మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న‌ది మంత్రాల‌య స్వామి వారికే. స‌జీవ న‌దిగా తుంగ‌భ‌ద్ర న‌ది పేరుగాంచింది..

Related image

ప్ర‌శాంత‌మైన వాతావర‌ణంతో శ్రీ‌శ్రీ‌శ్రీ రాఘ‌వేంద్రస్వామి కొలువు తీరిన మంత్రాల‌యం ఆల‌యం భ‌క్తుల కోర్కెల‌ను తీరుస్తోంది. పండితులు, పామ‌రులు, మ‌ఠాధిప‌తులు, స్వాములు, మేధావులు, ఉద్యోగులు, పిల్ల‌లు, పెద్ద‌లు, వృద్ధులు, ఇలా ప్ర‌తి ఒక్క‌రు ఇక్క‌డికి నిత్యం వ‌స్తూనే ఉంటారు. ఈ ప్రాంతానికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఈ ప‌విత్ర పుణ్య క్షేత్రం ప‌క్క‌నే ప్ర‌శాంతంగా తుంగ‌భ‌ద్ర‌మ్మ ప్ర‌వ‌హిస్తూనే ఉంటుంది. ఈ మ‌ఠం క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు తాలూకా ప‌రిధిలోకి వ‌స్తుంది. ట్రైను, బ‌స్సు సౌక‌ర్యం ఉంది.గ‌తంలో అనుకోని రీతిలో ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఈ ఆల‌యం కూడా మునిగి పోయింది. అయినా ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేదు. జ‌నం చెల్లా చెదురైనా మ‌ళ్లీ ఒక్క‌టిగా చేరారు. భ‌క్తుల‌కు స్వామి వారిపై ఉన్న న‌మ్మ‌కానికి ఇది నిద‌ర్శ‌నం. నిత్యం పూజ‌లు అందుకుంటూ కొలువుతీరి ఉన్నారు. ప్ర‌స్తుతం సుభీంద్ర‌తీర్థులు ఈ మంత్రాల‌య మ‌ఠానికి అధిప‌తిగా ఉన్నారు. క‌ర్ణాట‌క‌లోని ప‌లు ప్రాంతాల‌తో పాటు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో మంత్రాల‌యం పేరుతో మ‌ఠాలు కొలువై వున్నాయి.

Related image

భార‌తీయ సినిమాలోనే అత్యంత సంప‌న్న‌మైన న‌టుడిగా, కోట్లాదిమంది అభిమానుల‌ను స్వంతం చేసుకున్న తమిళ త‌లైవా ర‌జ‌నీకాంత్ శ్రీ‌శ్రీ రాఘ‌వేంద్ర స్వామి భ‌క్తుడు. ఏడాదిలో ఒక‌సారి త‌ప్ప‌క కుటుంబీకుల‌తో క‌లిసి మంత్రాల‌యానికి వ‌స్తారు. ఆయ‌న‌కు స్వామి వారంటే ఎన‌లేని భ‌క్తి..ప్రేమ‌. ఏదో మ‌హ‌త్తు..ఏదో ప్ర‌శాంతత ఆ ప్రాంతంలో నెల‌కొన్న‌ది. అంత‌కంటే స్వామి వారు చేసిన సేవ గొప్ప‌ది. నేను ఎక్క‌డికి వెళ్లినా లెక్క‌నేంత మంది ఫ్యాన్స్‌..త‌రాల‌కు స‌రిప‌డా నోట్లు, ఆస్తులు ఉన్నాయి. కానీ కాసింత ప్ర‌శాంతంత కావాలిగా..అదే నాకు హిమాలయాల్లో దొరికింది. అంత‌కంటే మంత్రాల‌య స్వామి వారి వ‌ద్ద ల‌భించింది ..అంటారు ర‌జనీకాంత్‌. త‌మిళ‌నాట ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిగా, డ్యాన్స‌ర్‌గా, న‌టుడిగా , కొరియా గ్రాఫ‌ర్‌గా పేరున్న లారెన్స్ కూడా శ్రీ రాఘ‌వేంద్ర స్వామి భ‌క్తుడే. తెలుగు వారే కాదు త‌మిళ‌, క‌న్న‌డిగులు శ్రీ స్వామి వారికి అత్య‌ధికంగా భ‌క్తులుగా ఉన్నారు. స్వామి వారి విష‌యానికి వ‌స్తే…శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1595లో జ‌న్మించి 1671 వ‌ర‌కు జీవించారు. హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువుగా పేరు సంపాదించుకున్నారు. వైష్ణవాన్ని అనుస‌రిస్తూ..మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు.

Related image

తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే.. ఆయన 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.

ఈ క్రింద వీడియో చూడండి

తర్వాత పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట.. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని చెబుతారు. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు పంచముఖ హనుమంతుడు యొక్క పరమ భక్తుడు. నిత్యం పూజ‌లు అందుకుంటూ భ‌క్తుల‌కు ప్ర‌శాంత‌త‌ను చేకూరుస్తూ ..కోరిన కోర్కెల‌ను తీరుస్తూ మంత్రాల‌యం విశిష్ట‌మైన పుణ్య క్షేత్రంగా బాసిల్లుతోంది. ఎప్పుడైనా వీలైతే మీరూ ఈ పుణ్య‌మైన ప్రాంతాన్ని, న‌ది ప‌క్క‌నే ఉన్న మ‌ఠాన్ని ద‌ర్శించండి. ఉద్విగ్న‌త‌కు లోన‌వుతారు. మీలో మార్పు ప్రారంభ‌మ‌వుతుంది. ఆ స్వామి వారి కృప అలాంటిది. రాఘవేంద్రుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల రూపంలో తెలియచేయండి.