జులై 27 గ్రహణం రోజు తల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా

946

జూలై 27 అర్థరాత్రి 11 గంటల 54 నిమిషాలకు శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది..అయితే గ్రహణ సమయంలో స్నానం ఆచరిచడం అనేది ఒక మంచి పద్ధతి.అయితే స్నానం ఎలా చెయ్యాలి.ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for chandra grahan

గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు అనే అపోహలకు బయపడకండి.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రహణ సమయంలో కాలక్రుత్యాలు చేసుకోవచ్చును.అయితే స్నానం మాత్రం ఒక పద్దతిలో చెయ్యాలి.జులై 27 వ తేదిన గ్రహణ పట్టు స్నానం మరియు జులై 28 వ తేదిన గ్రహణ విడుపుస్నానాలు ఖచ్చితంగా చెయ్యాలి.ఒకవేళ మీకు గ్రహణ పట్టు స్నానం చెయ్యడానికి వీలు కాకపోతే కనీసం గ్రహణ విడుపు స్నానం చెయ్యాలి.ముఖ్యంగా తల స్నానం చెయ్యాలి.తల స్నానం చేస్తేనే చాలా మంచిది.

Image result for indian man head bath

పంచాగం ప్రకారం గ్రహణ స్పర్శం మోక్షం గమనాలను తెలుసుకుని స్నానం చెయ్యాలి.గ్రహాన స్నానాన్ని కట్టుకున్న వస్త్రాలతోనే చెయ్యాలి.గ్రహణం మరసటి రోజు శనివారం నాడు ఇల్లు శుభ్రంగా తుడుచుకుని.స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంజ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను “పులికాపి” చేయాలి.

శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోశ నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి,ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి.ఇలా చేస్తే గ్రహణ దోషం అనేది మన దరికి చేరదు.కాబట్టి ఇలా స్నానం ఆచరించి పూజ చేసి మంచి ఫలితాలను పొందండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.