చిలుకూరు బాలాజీ గురించి షాకింగ్ విషయాలు

786

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఆలయాల్లో ఒక ప్రత్యేకతని, ప్రాధాన్యాన్ని సంతరించుకున్న గుడి చిలుకూరి బాలాజీ ఆలయం. హైదరాబాద్ నగరానికి అతి దగ్గరగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జిల్లాలో వెలిసిన ఈ దివ్యక్షేత్రం వీసా బాలాజీ ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బాలాజీని దర్శించుకుంటే.. వీసా త్వరగా వస్తుందని అనేకమంది ఉద్యోగార్థులు, ఎన్నారైలు నమ్ముతుంటారు. మరి ఈ పవిత్ర ఆలయం గురించి మరిన్ని ప్రత్యేకమైన వివరాలు తెలుసుకుందామా..

Image result for చిలుకూరు బాలాజీ

చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి విననివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. శ్రీ వెంకటేశ్వర స్వామీకి అలాగే వారి భార్యలైన శ్రీదేవి, భూదేవిలకి అంకితమివ్వబడినది ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని గున్నాల మాధవరెడ్డి అనే భక్తుడు నిర్మించాడని అంటారు. ప్రతి యేటా బాలాజీ దర్శనం కోసం తిరుమలకు కాలినడకన పయనమయ్యే ఆయన మలివయసులో అనారోగ్యం వల్ల వెళ్లలేకపోయారట. అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మన్నారాయణుడే కలలో దర్శనమిచ్చి.. ఏ మాత్రం బాధపడవద్దని.. తాను అతని వూరిలోని పుట్టలోనే వెలిశానని తెలియజేశాడట. గునపంతో ఆ పుట్ట తవ్వుతున్నప్పుడు స్వామివారి విగ్రహం నుంచి నెత్తురు కారిందట. అప్పుడు పాలతో ఆ పుట్టను కరిగించి విగ్రహాన్ని బయటకు తీశారని, ఆ పుట్ట వెలిసిన చోటులోనే ఆలయం కట్టారని ఓ కథ ప్రచారంలో ఉంది.

Image result for చిలుకూరు బాలాజీ

చిలుకూరు 10, 12 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైంది. డబ్బులు అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచవ్యాప్తంగా ఈ గుడి ప్రాచుర్యం పొందింది. నిజానికి ఈ గుడిలో ఎటువంటి హుండీలు ఉండవు. ఈ గుడికి వచ్చే ఆదాయమంతా పార్కింగ్ ఫీజు ద్వారా మాత్రమే. చిలుకూరు బాలాజీ గుడిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, విఐపీలకు ప్రత్యేక క్యూలు ఉండవు. అందరూ సమానమనే భావాన్ని కలిగించడం కోసమే ఈ ప్రయత్నమని ఆలయ ధర్మకర్తలు చెబుతుంటారు.

ఈ క్రింద వీడియో చూడండి

చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు.తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరతాయని,చిలుకూరు చిలుకూరు బాలాజీ టెంపుల్ వీసా బాలాజీ దేవునిగా ప్రసిద్ది చెందినది. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి స్వామి వారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది.ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మీకు ఏమైనా నెరవేరని కోరికలు ఉంటె చిలుకూరు వెళ్లి కోరుకోండి. తప్పక నెరవేరుతుంది.